![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -278 లో...కార్తీక్, దీపలు పూజ చేస్తారు. పిలవకుండానే శ్రీధర్ పూజ కు వస్తాడు. పూజ పూర్తయ్యాక కార్తీక్, శ్రీధర్ ల మధ్య గొడవ అవుతుంది. నీ కూతురు ఆపరేషన్ కు డబ్బు ఎవరు ఇచ్చారో తెలుసా అని శ్రీధర్ అంటాడు. తెలియదని కార్తీక్ అనగానే నాకు తెలుసని శ్రీధర్ అంటాడు
ఎవరో చెప్పి వెళ్ళిపో అని కార్తీక్ చిరాకుగా అంటాడు. ఎక్కడ తన పేరు చెప్తాడో అని కావేరి భయపడుతుంది. ఎవరు అంటే నేనే అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. అబద్దం చెప్పకండి అని కావేరి అంటుంది. డబ్బు, నగలు ఏం చేసావని నీ చెంపపగులగొట్టాలి కానీ అది చెయ్యడం లేదు నా కొడుకుతో.. నీ కూతురు కాని కూతురు ప్రాణాలు కాపాడింది నేనే ని చెప్పడం కోసం అలా చెయ్యడం అని శ్రీధర్ అంటాడు. అంతేకాదు నా పెళ్ళాం నన్ను మోసం చేసినట్టు.. నీ పెళ్ళాం కూడ నిన్ను మోసం చేసింది. శౌర్య ఆపరేషన్ కు కావేరి డబ్బు ఇచ్చిన విషయం నీ పెళ్ళానికి తెలుసు కానీ నీకు చెప్పలేదని శ్రీధర్ అనగానే కార్తీక్ మనసు ముక్కలు అవుతుంది. నిజమేనా దీప అనగానే.. నిజమే అని దీప అంటుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత శ్రీధర్ తన మనసులోని కుట్రని బయట పెడతాడు. శ్రీధర్, కావేరి, స్వప్నలు కార్ దగ్గరికు వస్తారు. ఎందుకు అన్నయ్య ని బాధపెట్టావని శ్రీధర్ తో స్వప్న గొడవ పెట్టుకుంటుంది.
శ్రీధర్ మరి శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తాడు. దాంతో స్వప్నకు కోపం వస్తుంది. కూతురు అని చూడకుండా తనని కూడా ఇష్టం వచ్చినట్లు మాటలు అనేస్తాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. మీ చూపులు నాకు చెంప పెట్టులాగా అనిపిస్తున్నాయని కార్తీక్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |